Search for:
  • Home/
  • Breaking/
  • భారత్‌ తీన్‌మార్‌

భారత్‌ తీన్‌మార్‌

ఆసియాకప్‌ ఆర్చరీ

బాగ్దాద్‌: ఆసియాకప్‌ ఆర్చరీలో భారత విలువిద్యాకారులు సత్తాచాటుతున్నారు. లెగ్‌-1లో భాగంగా జరుగుతున్న పోటీల్లో శనివారం మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వ్యక్తిగత విభాగాల్లో మరో 10 పతకాలను ఖాయం చేసుకున్నారు.

పురుషుల, మహిళల, మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ టీమ్‌ విభాగాల్లో భారత్‌కు పసిడి పతకాలు దక్కాయి. మూడు విభాగాల్లోనూ ఇరాన్‌తోనే జరిగిన ఫైనల్స్‌లో మనవాళ్లు అదరగొట్టారు.