Search for:
  • Home/
  • Breaking/
  • ఢిల్లీ ‘హ్యాట్రిక్‌’…

ఢిల్లీ ‘హ్యాట్రిక్‌’…

  - మూడో విజయంతో అగ్రస్థానానికి
 - రాణించిన మెగ్‌ లానింగ్, జెస్‌ జొనాసెన్, రాధా యాదవ్‌
 - వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిన గుజరాత్‌ జెయింట్స్‌  

బెంగళూరు: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 25 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిన తర్వాత క్యాపిటల్స్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే గుజరాత్‌ పరిస్థితి మాత్రం మరింత దిగజారింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమ్‌ ఒక్క గెలుపు కూడా లేకుండా వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 చేయగా…. జెయింట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది.