Search for:

15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై..

రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌ నూర్‌ అలీ ఆఫ్గానిస్తాన్‌ వెటరన్‌ ఆటగాడు నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. నూర్‌ అలీ తన నిర్ణయాన్ని గురువారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 35 ఏళ్ల జద్రాన్‌.. 2019లో స్కాట్‌లాండ్‌తో జరిగిన వన్డేతో అఫ్గాన్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. జద్రాన్‌ అఫ్గానిస్తాన్‌ తరపున 51 వన్డేలు, 23 టీ20లు, 2 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. తన [...]

ఘనమైన ముగింపుపై భారత్‌ దృష్టి

భారత జట్టు హైదరాబాద్‌లో తొలి టెస్టును కోల్పోయిన తీరు చూస్తే నాలుగో టెస్టు ముగిసే సరికి మన జట్టు సిరీస్‌ గెలుచుకోగలదని ఎవరూ ఊహించలేదు. తర్వాతి మూడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్‌ మెరుగ్గానే ఆడినా, వెనుకబడిన ప్రతీసారి కోలుకుంటూ టీమిండియా వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు సిరీస్‌ సొంతం కావడంతో చివరి మ్యాచ్‌నూ గెలిచి ఘనంగా ముగించాలని రోహిత్‌ బృందం భావిస్తుండగా… సిరీస్‌ ఓడినా మరో మ్యాచ్‌ గెలిచి అంతరాన్ని 2–3కు [...]

ఉలిక్కిపడ్డ ఆసీస్‌ క్రికెట్‌.. బంతి తగిలి క్రికెటర్‌కు గాయం

ఆస్ట్రేలియా క్రికెట్‌ మరోసారి ఉలిక్కిపడింది. బంతి తలకు తగిలి 26 ఏళ్ల విల్‌ పుకోస్కీ అనే క్రికెటర్‌ గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ఎలాంటి హాని జరగనప్పటికీ… ఈ ఉదంతం దివంగత ఫిల్‌ హ్యూస్‌ విషాదాన్ని గుర్తు చేసింది. 2014లో హ్యూస్‌ షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అదే షెఫీల్డ్‌ షీల్డ్‌లో ఇంచుమించు అలాంటి ఘటనే జరగడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉలిక్కిపడింది. పుకోస్కీకి తగిలిన గాయం [...]

ఇండో-పాక్‌ మ్యాచ్‌ టికెట్‌ రూ.1.8 కోట్లా?

న్యూఢిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ప్రపంచ క్రికెట్‌లో ఎనలేని క్రేజ్‌. అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్‌క్‌పలో జూన్‌ 9న న్యూయార్క్‌లో జరిగే ఈ ఇండో-పాక్‌ జట్ల మ్యాచ్‌ టిక్కెట్లకు కూడా ఊహించని డిమాండ్‌ ఏర్పడింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్‌ కోసం ప్రత్యేకంగా మూడు కేటగిరీలుగా రూ. 14 వేల నుంచి 33 వేల వరకు (175, 300, 400 డాలర్లు) ధరలను నిర్ణయించారు. అయితే, అమ్మకాలు [...]

రికార్డుల్లోకెక్కిన తమిళనాడు కెప్టెన్‌

తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్‌ సాయికిషోర్‌ రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 6 వికెట్లు తీయడం ద్వారా ప్రస్తుత సీజన్‌లో తన వికెట్ల సంఖ్యను 52 పెంచుకున్నాడు. తద్వారా ఓ రంజీ సీజన్‌లో 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో తమిళ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో [...]

ఆ నలుగురి ఖేల్‌ ఖతమైనట్లేనా..?

బీసీసీఐ ప్రకటించిన 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్‌ చతేశ్వర్‌ పుజారా, శిఖర్‌ ధవన్‌, ఉమేశ్‌ యాదవ్‌ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ‍ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్‌ దేశవాలీ క్రికెట్‌లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్‌ అయితే మొత్తానికే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్‌ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ [...]

డబుల్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు వీరవిహారం

టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. అజేయ డబుల్ సెంచరీతో వీరవిహారం చేశాడు. 128 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ముషీర్ ఖాన్ నేడు డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి సెంచరీనే ముషీర్ ఖాన్ [...]

భారత్‌ తీన్‌మార్‌

ఆసియాకప్‌ ఆర్చరీ బాగ్దాద్‌: ఆసియాకప్‌ ఆర్చరీలో భారత విలువిద్యాకారులు సత్తాచాటుతున్నారు. లెగ్‌-1లో భాగంగా జరుగుతున్న పోటీల్లో శనివారం మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వ్యక్తిగత విభాగాల్లో మరో 10 పతకాలను ఖాయం చేసుకున్నారు. పురుషుల, మహిళల, మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ టీమ్‌ విభాగాల్లో భారత్‌కు పసిడి పతకాలు దక్కాయి. మూడు విభాగాల్లోనూ ఇరాన్‌తోనే జరిగిన ఫైనల్స్‌లో మనవాళ్లు అదరగొట్టారు. [...]

భారత్‌ తడబాటు భారత స్పిన్నర్‌ జడేజా మిగిలిన మూడు వికెట్లను పడగొట్టిన మన స్పిన్‌ పిచ్‌పై ప్రత్యర్థి ఆఫ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ఆ తర్వాత అంతకు మించి పట్టు సాధించాడు. ఇది భారత తొలి ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టింది. అలాగే ‘అంపైర్‌ కాల్‌’ భారత వికెట్లను ప్రభావితం చేసింది. క్రీజులో ప్రధాన బ్యాటర్‌ అంటూ లేకుండా చేయడంతో పరుగుల పరంగా టీమిండియా వెనుకబడింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ పైచేయి [...]

తండ్రి ఆటోలో..తనయ ఆటలో..

– ఒకే ఒక్క సిక్సర్‌తో ఈ అమ్మాయి అందరికి పరిచయమైపోయింది. సజీవన్‌ సజన.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2 మొదలయ్యే వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఒకే ఒక్క సిక్సర్‌తో ఈ అమ్మాయి అందరికి పరిచయమైపోయింది. ఆడింది ఒకే బంతి అయినా.. ఒక్క షాట్‌తో ఆమె పేరు మార్మోగింది. ముంబయి ఇండియన్స్‌-దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్‌ బాదిన సజన.. దిల్లీని [...]