Search for:

అగర్వాల్‌ ట్రిపుల్‌ సెంచరీ.. ఇన్నింగ్స్‌ తేడాతో హైదరాబాద్‌ విజయం

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో హైదరాబాద్‌ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ప్లేట్‌ గ్రూపులో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 180 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన అరుణాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్‌ బౌలర్లలో మిలాంద్‌, కార్తీకేయ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగరాజన్‌ రెండు వికెట్లు సాధించారు. అనంతరం హైదరాబాద్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో [...]

సెంచరీతో చెలరేగిన పోప్‌.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు

హైదరాబాద్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. మూడో రోజు ఆటలో భారత్‌కు ధీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్‌.. భారీ స్కోర్‌ దిశగా అడుగులు వేస్తోంది. శనివారం ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 316 పరుగులు సాధించింది. ఇంగ్లీష్‌ జట్టు ప్రస్తుతం 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో యువ ఆటగాడు ఓలీ పోప్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓ [...]

సబలెంకా… మళ్లీ చాంపియన్‌

మెల్‌బోర్న్‌: బెలారస్‌ టెన్నిస్‌ స్టార్, డిఫెండింగ్‌ చాంపియన్‌ సబలెంకా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది. వరుసగా రెండో ఏడాదీ మహిళల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్‌ సబలెంకా 76 నిమిషాల్లో 6–3, 6–2తో చైనాకు చెందిన 12వ సీడ్‌ జెంగ్‌ కిన్‌వెన్‌పై గెలిచింది. విజేత సబలెంకాకు 31,50,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు), రన్నరప్‌ జెంగ్‌ కిన్‌వెన్‌కు 17,25,000 ఆ్రస్టేలియన్‌ [...]

హైదరాబాద్‌ బ్యాటర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ..

Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్‌లో హైదరాబాద్‌ బ్యాటర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ సంచలనం సృష్టించాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20 మ్యాచ్‌ తరహాలో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కు అందుకుని ఈ మేరకు అరుదైన ఘనత సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో [...]

భారత అమ్మాయిల శుభారంభం

మస్కట్‌: హాకీ ఫైవ్స్‌ మహిళల ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది. బుధవారం పూల్‌-సి తొలి మ్యాచ్‌లో 5-4 గోల్స్‌తో పోలెండ్‌ను ఓడించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి పోటాపోటీగా సాగింది. తొలి పది నిమిషాల్లోనే భారత్‌-పోలెండ్‌ ఖాతాలో రెండేసి గోల్స్‌ చేరాయి. భారత్‌ తరఫున ముంతాజ్‌ (4వ), దీపిక (6వ).. పోలెండ్‌ జట్టులో జూలియా (8వ), మార్లీనా (10వ) సఫలమయ్యారు. 23వ నిమిషంలో ముంతాజ్‌, మరియానా గోల్స్‌ సాధించడంతో భారత్‌ [...]