Search for:

నాగల్‌కు సూపర్‌ చాన్స్‌

మెల్‌బోర్న్‌: భారత యువ టెన్నిస్‌ ఆటగాడు సుమీత్‌ నాగల్‌.. ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ ‘డ్రా’కు అడుగు దూరంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌ టోర్నీలో నాగల్‌ దుమ్మురేపుతున్నాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో నాగల్‌ 6-3, 6-2తో ఎడ్వర్డ్‌ వింటర్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు.

శుక్రవారం జరగనున్న క్వాలిఫయింగ్‌ చివరి పోరులో అలెక్స్‌ మోల్కాన్‌ (స్లొవేకియా)పై గెలిస్తే నాగల్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానంలో ఉన్న నాగల్‌.. గతంలో మూడుసార్లు (2019 యూ ఎస్‌ ఓపెన్‌, 2020 యూఎస్‌ ఓపెన్‌, 2021 ఆస్ట్రేలియా ఓపెన్‌) గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ టోర్నీకి అర్హత సాధించాడు