Search for:

యోధాస్‌కు నిరాశ

కటక్‌: అల్టిమేట్‌ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌కు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో యోధాస్‌ 29-31తో చెన్నై క్విక్‌గన్స్‌ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్‌లో తొలుత యోధా స్‌ ఆధిక్యం కనబరిచినా..చెన్నై అద్భుతంగా పుంజుకుని పోటీలోకి వచ్చింది.

అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 29-27తో ఒడిశా జాగర్‌నెట్స్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం గుజరాత్‌, చెన్నై మధ్య ఫైనల్‌ పోరు జరుగనుంది.