Search for:
  • Home/
  • Uncategorized/
  • ప్రొకబడ్డీలో బాలయ్య సందడి

ప్రొకబడ్డీలో బాలయ్య సందడి

ప్రొ కబడ్డీ పదో సీజన్‌ భాగ్యనగరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా.. లీగ్‌ ప్రచారకర్త, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి తెలుగు టైటాన్స్‌-బెంగళూరు బుల్స్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య.. తొడ గొట్టి క్రీడాకారులను, అభిమానులను ఉత్తేజపరిచారు. ఆయన మాట్లాడుతూ.. క్రికెట్‌ తరువాత కబడ్డీ బాగా ప్రాచుర్యం పొందిందన్నారు. తనకు క్రీడలంటే ఎంతో ఇష్టమన్న బాలయ్య.. తన కారులో ఎప్పుడు క్రికెట్‌ కిట్‌ ఉంటుందని, సమయం దొరికితే క్రికెట్‌, టేబుల్‌ టెన్నిస్‌ ఎక్కువగా ఆడతానని చెప్పారు. ప్రొ కబడ్డీ చూస్తుంటే తనకు పాఠశాల, కళాశాల రోజులు గుర్తుకొస్తున్నాయని ఆయన అన్నారు.