Search for:

కోర్టుకెక్కిన రెజ్లర్‌ బజ్‌రంగ్‌

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మార్చి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న సెలక్షన్‌ ట్రయల్స్‌ ఆపాలంటూ స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా కోర్టుకెక్కాడు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనాలని తనకు అందిన ఆహ్వానాన్ని తిరస్కరించిన అతను.. ట్రయల్స్‌ ఆపాలంటూ దిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ వేశాడు. బజ్‌రంగ్‌తో పాటు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, సత్యవర్త్‌ కడియన్‌ కూడా ఈ పిటిషన్లో భాగమైనట్లు సమాచారం. వీళ్లంతా గత ఏడాది అప్పటి [...]

టైటిల్‌ పోరుకు పుణేరి, హరియాణా

రేపు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌ సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) పదో సీజన్‌లో కొత్త చాంపియన్‌ ఖాయమైంది. నిరుటి రన్నరప్‌ పుణేరి పల్టన్‌తో అమీతుమీకి తొలిసారి ఫైనల్‌కు చేరిన హరియాణా స్టీలర్స్‌ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్‌లోనే ఫైన ల్‌ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్‌లో ‘హ్యాట్రిక్‌’ టైటిళ్ల విజేత పట్నా పైరేట్స్, రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ ప్రత్యర్థుల చేతుల్లో [...]

నిహార్‌ పసిడి ధమాకా

గువాహటి వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర యువ సైక్లిస్ట్‌ సాయి నిహార్‌ బిక్కిన అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 400మీటర్ల మెడ్లె ఈవెంట్‌లో నిహార్‌ పసిడి పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరును నిహార్‌(కేఎల్‌ఈఎఫ్‌ యూనివర్సిటీ) 4:45:01 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. మణికంఠ(జైన్‌ యూనివర్సిటీ), ఆర్యన్‌ భోంస్లే(యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై) వరుసగా రజత, కాంస్య పతకాలు [...]

హితేశ్‌ స్వర్ణ జోరు

పారా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ ఇండోర్‌ వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ పారా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ప్యాడ్లర్‌ హితేశ్‌ దోల్వాని పసిడి పతక జోరు కనబరిచాడు. బుధవారం జరిగిన మూడు వేర్వేరు విభాగంలో హితేశ్‌ స్వర్ణ పతకాలతో మెరిశాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో హితేశ్‌ 6-11, 12-10, 11-6, 11-9తో విశ్వ తాంబెపై గెలిచాడు. అదే దూకుడు కొనసాగిస్తూ డబుల్స్‌లో హితేశ్‌, కునాల్‌ అరోరా జోడీ 11-8, [...]

హైదరాబాద్‌లో ఎఫ్‌ఐఎమ్‌ వరల్డ్‌కప్‌

ముంబై: ప్రతిష్ఠాత్మక ఎఫ్‌ఐఎమ్‌ ఈ-ఎక్స్‌ప్లోరర్‌ వరల్డ్‌కప్‌ సీజన్‌-2కు భారత్‌లో తొలిసారి హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమివ్వబోతున్నది. 2024 షెడ్యూల్‌ను అనుసరించి ఇప్పటికే ఒసాకా(జపాన్‌) వేదికగా ఈ నెల 16, 17తేదీల్లో మొదటి రౌండ్‌ జరుగనుండగా, నార్వే (రౌండ్‌-2, మే 3-4), ఫ్రాన్స్‌(రౌండ్‌-3, జూన్‌ 21-23), స్విట్జర్లాండ్‌ (రౌండ్‌-4, సెప్టెంబర్‌ 20-22), హైదరాబాద్‌(రౌండ్‌-5, నవంబర్‌ 29, డిసెంబర్‌ 1) పోటీలు ఉండనున్నాయి. ఈ విషయాన్ని భారత్‌ తరఫున బరిలోకి దిగుతున్న ఇండీ రేసింగ్‌ [...]

ఆడుదాం ఆంధ్రా …

విశాఖలో ముగింపు వేడుకలు.. పాల్గొననున్న సీఎం జగన్‌ మహా క్రీడా సంబరం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు రానున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు. కాగా సీఎం జగన్‌.. నేడు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి [...]

ఫిఫా ర్యాంకుల్లో మన స్థానం 117

న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన.. భారత ఫుట్‌బాల్‌ జట్టు ర్యాంకింగ్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. తాజాగా విడుదల చేసిన ఫిఫా ర్యాంకుల జాబితాలో భారత్‌ 15 స్థానాలు దిగజారి 117వ స్థానంలో నిలిచింది. 2017 తర్వాత టీమిండియా ర్యాంక్‌ ఇంతగా పతనం కావడం ఇదే తొలిసారి. ఆసియాక్‌ప లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ భారత్‌ ఓటములను చవిచూసింది. అంతేకాకుండా ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేదు. దీంతో [...]

ఐస్‌ ప్యాలెస్‌ ‘వాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’పై చోప్రా

ఒలింపిక్‌ చాంపియన్‌కు అరుదైన గౌరవం లౌజానే (స్విట్జర్లాండ్‌): ఒలింపిక్‌ చాంపియన్‌, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ ఐస్‌ ప్యాలెస్‌ యింగ్‌ఫావ్‌ ‘వాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో నీరజ్‌ చిత్రానికి చోటు లభించింది. ప్యాలెస్‌ గోడపై నీరజ్‌ పేరిట ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని అతడు ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా అక్కడ ఉంచేందుకు తన జావెలిన్‌ను బహుమానంగా ఇచ్చాడు. అనంతరం జావెలిన్‌ త్రో విన్యాసాలతో సందర్శకులకు [...]

‘పారిస్‌’ పతకాల్లో ఈఫిల్‌ టవర్‌..!

పారిస్‌: ఈ ఒలింపిక్స్‌ పతకాలు మిగతా పతకాలకంటే అతి భిన్నమైనవి… అమూల్యమైనవి! ఎందుకంటే ఈ పతకాల్లో బంగారం, వెండి, ఇత్తడి లోహాలే కాదు అంతకుమించి అపురూపమైంది ఇందులో ఇమిడి ఉంది. ఫ్రాన్స్‌కే తలమానికమైన ‘ఈఫిల్‌ టవర్‌’ ప్రతి పతకంలోనూ దాగి ఉంది. అదేలా అంటే… ఈ వివరాల్లోకి వెళ్దాం! ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌ నగరంలో విశ్వక్రీడలు జరుగుతాయి. ఈ పోటీల్లో పతక [...]

✨హైదరాబాద్‌లో ఫిఫా అర్హత మ్యాచ్‌

హైదరాబాద్‌..ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ పోరుకు ఆతిథ్యమివ్వబోతున్నది. నగరం వేదికగా జూన్‌ 6వ తేదీన ఆతిథ్య భారత్‌, కువైట్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(టీఎఫ్‌ఏ) కార్యదర్శి జీపీ ఫాల్గుణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌ తొలిసారి ఫిఫా అర్హత పోరుకు వేదికవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఫాల్గుణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని [...]