Search for:

రారాజు గుకేశ్‌..

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ 2024 టైటిల్‌ కైవసం టొరంటో : భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ సంచలన ప్రదర్శనతో ప్రతిష్టాత్మక ‘క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ 2024’ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్‌ విజేతను నిర్ణయించే 14వ రౌండ్‌లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను డ్రా చేసుకున్న అతడు 9 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానానికి చేరి 17 ఏండ్ల వయసులోనే ఈ టోర్నీ నెగ్గిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. [...]

భారత నంబర్‌వన్‌గా శ్రీజ

న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మహిళల సింగిల్స్‌ నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్‌వన్‌గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. భారత్‌ నుంచి యశస్విని [...]

రోయింగ్‌లో భారత్‌కు తొలి బెర్తు

చుంగ్జు: రోయింగ్‌ క్రీడలో భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో దేశానికి తొలి బెర్తు దక్కింది. దక్షిణ కొరియాలోని చుంగ్జు వేదికగా జరుగుతున్న 2024 వరల్డ్‌ ఆసియన్‌ అండ్‌ ఒషియానియన్‌ ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌లో భాగంగా భారత ఆర్మీకి చెందిన 25 ఏండ్ల బాల్రాజు పన్వర్‌.. 2000 మీటర్ల పురుషుల సింగిల్స్‌ ఈవెంట్‌లో భారత్‌కు బెర్తును ఖాయం చేశాడు. ఈ పోటీలలో భాగంగా 7 నిమిషాల 1.27 సెకన్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసిన అతడు మూడో [...]

పారాలింపిక్స్‌కు వెంకటనారాయణ

ప్యాపిలి : నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్‌ కొంగనపల్లె వెంకటనారాయణ పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అనిత (రాజస్థాన్‌)తో అతను దక్షిణ కొరియాలో జరిగిన పారాలింపిక్స్‌ అర్హత టోర్నీలో సత్తా చాటాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ స్కల్స్‌ ఈవెంట్లో ఈ జోడీ విజేతగా నిలిచి ఆగస్టులో పారిస్‌లో జరిగే పారాలింపింపిక్స్‌కు ఎంపికైంది. [...]

ఫ్రెండ్‌షిప్‌ గేమ్స్‌’.. రాజకీయ కుట్ర

జెనీవా: ‘ప్రపంచ క్రీడల’పై రష్యా ఎదురుదాడి.. అంతర్జాయతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ)ని కలవరపెడుతోంది. ఒలింపిక్స్‌లో తమ దేశంపై నిషేధం విధించడంతో.. రష్యానే అలాంటి విశ్వక్రీడల నిర్వహణకు సన్నాహకాలు చేస్తోంది. ఒలింపిక్స్‌ తరహాలో సెప్టెంబరు 15 నుంచి 29 వరకు మాస్కో, యకతరీన్‌బర్గ్‌లో ‘అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్‌ గేమ్స్‌’ పేరుతో గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇదివరకే ప్రకటించారు. ఇందులో పతక విజేతల కోసం రూ. 415 కోట్ల ప్రైజ్‌మనీని [...]

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో పంకజ్‌ అద్వానీ

న్యూఢిల్లీ: భారత క్యూ స్పోర్ట్స్‌ (స్నూకర్, బిలియర్డ్స్‌) దిగ్గజం పంకజ్‌ అద్వానీ తన విజయవంతమైన కెరీర్‌లో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బిలియర్డ్స్‌ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో పంకజ్‌కు స్థానం కల్పించారు. చైనాలోని షాంగ్రావొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్‌ మ్యూజియంలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాను పొందుపరిచారు. ప్రపంచ విశిష్ట క్రీడాకారుల సరసన తన పేరు ఉండటం చాలా సంతోషంగా [...]

జొకోవిచ్‌కు షాక్‌

కాలిఫోర్నియా: ఐదేళ్ల తర్వాత ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ –1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. టాప్‌ సీడ్‌ హోదాలో పోటీపడ్డ ఈ సెర్బియా దిగ్గజం పోరాటం మూడో రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ 123వ ర్యాంకర్‌ లూకా నార్దీ మూడో రౌండ్‌లో 6–4, 3–6, 6–3తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ [...]

బజరంగ్, రవి దహియాలకు షాక్‌

సోనెపట్‌ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా… కాంస్య పతకం నెగ్గిన బజరంగ్‌ పూనియాలకు షాక్‌! పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో బజరంగ్‌ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్‌ 1–9తో రోహిత్‌ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్‌పై సుజీత్‌ కల్కాల్‌ గెలుపొంది ఆసియా, [...]

సాత్వి క్‌–చిరాగ్‌ జోడీదే టైటిల్‌

పారిస్‌: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సాత్వి క్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోరీ్నలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జంట సాత్వి క్‌–చిరాగ్‌ 21–11, 21–17తో లీ జె హుయ్‌–పో సువాన్‌ యాంగ్‌ [...]

భారత బృందానికి స్వర్ణం

ఆసియా ఆక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్ దిల్లీ: ఆసియా ఆక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బృందం స్వర్ణం సొంతం చేసుకుంది. 4×200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలే విభాగంలో ఆర్యన్‌ నెహ్రా, అనీశ్‌ గౌడ, సాజన్‌ ప్రకాశ్‌, శ్రీహరిల బృందం 7 నిమిషాల 26.64 సెకన్లలో రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు ఆసియా గేమ్స్‌లో నమోదైన భారత స్విమ్మర్ల అత్యుత్తమ టైమింగ్‌ (7:29.04)ను మెరుగుపరిచింది. వియత్నాం (7:29.43) జట్టుకు రజతం, థాయ్‌లాండ్‌ (7:40.37) బృందానికి [...]