Search for:
  • Home/
  • Breaking/
  • కోర్టుకెక్కిన రెజ్లర్‌ బజ్‌రంగ్‌

కోర్టుకెక్కిన రెజ్లర్‌ బజ్‌రంగ్‌

 - సెలక్షన్స్‌ ఆపండి

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మార్చి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న సెలక్షన్‌ ట్రయల్స్‌ ఆపాలంటూ స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా కోర్టుకెక్కాడు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనాలని తనకు అందిన ఆహ్వానాన్ని తిరస్కరించిన అతను.. ట్రయల్స్‌ ఆపాలంటూ దిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ వేశాడు. బజ్‌రంగ్‌తో పాటు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, సత్యవర్త్‌ కడియన్‌ కూడా ఈ పిటిషన్లో భాగమైనట్లు సమాచారం. వీళ్లంతా గత ఏడాది అప్పటి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌.. బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితుడు కావడంతో సమాఖ్యలో తాము కోరుకున్న మార్పును ఆశించలేమని బజ్‌రంగ్‌ బృందం అంటోంది. డబ్ల్యూఎఫ్‌ఐపై ఐఓఏ నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో సమాఖ్య సెలక్షన్స్‌ ఎలా నిర్వహిస్తుందని బజ్‌రంగ్‌ ప్రశ్నించాడు. అతను ప్రస్తుతం రష్యాలో శిక్షణ తీసుకుంటున్నాడు. డబ్ల్యూఎఫ్‌ఐ నిర్వహించబోయే సెలక్షన్స్‌ ఆధారంగానే వచ్చే నెల కిర్గిజ్‌స్థాన్‌లో జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయర్‌కు జట్టును ఎంపిక చేయనున్నారు.